TG: రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల నియంత్రణపై మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్షించారు. గత రెండేళ్లతో పోల్చితే, ఈ ఏడాది డెంగీ, మలేరియా, టైఫాయిడ్ కేసులు గణనీయంగా తగ్గాయని మంత్రికి అధికారులు వివరించారు. గతేడాది 226 మలేరియా కేసులు నమోదవగా, ఈ ఏడాది 209 కేసులు మాత్రమే వచ్చాయన్నారు. గతేడాది టైఫాయిడ్ కేసులు 10,149 నమోదవగా, ఈ ఏడాది 4600 మాత్రమే నమోదయ్యాయని తెలిపారు.