»Khalistani Terrorist Hardeep Singh Nijjar Killed Canada Foreign Minister Melanie Joly Expelled Indian Diplomat
Canada expels: ఉగ్రవాది హతం..భారత దౌత్యవేత్తను బహిష్కరించిన కెనడా
కెనడా(Canada), భారత్(bharat) దేశాల మధ్య జీ20 సదస్సు తర్వాత క్రమంగా వివాదాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా సోమవారం కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ(Melanie Joly) ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను హతమార్చడంపై భారత దౌత్యవేత్తను బహిష్కరించారు. ఇది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Khalistani terrorist Hardeep Singh Nijjar killed Canada Foreign Minister Melanie Joly expelled Indian diplomat
కెనడాలో జరిగిన సిక్కు వ్యక్తి హత్యతో భారత ప్రభుత్వానికి సంబంధాలు ఉన్నాయని కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఇప్పటికే ఆరోపణలు చేశారు. అంతేకాదు ఈ అంశంపై జీ20 సదస్సులో కూడా ప్రస్తావించారు. అయితే తాజాగా ఈ ఆరోపణలపై కెనడా విదేశాంగ మంత్రి జోలీ(Melanie Joly) సోమవారం భారతీయ దౌత్యవేత్తను బహిష్కరించారు. ఇది నిజమని నిరూపితమైతే ఆయా దేశాలు ఎలా వ్యవహరిస్తాయనే అంశాన్ని ప్రస్తావించారు. దీంతోపాటు కీలక నియమాలను ఉల్లంఘించడమే అవుతుందని జోలీ అన్నారు.
కెనడాలోని హౌస్ ఆఫ్ కామన్స్ (పార్లమెంట్)లో సోమవారం ట్రూడో(justin trudeau) మాట్లాడుతూ “కెనడా గడ్డపై తమ పౌరుడిని హతమార్చటం మన సార్వభౌమాధికారాన్ని సహించలేనిదని అన్నారు. ఇది స్వేచ్ఛా, ప్రజాస్వామ్య నియమాలకు విరుద్ధమని పేర్కొన్నారు. కెనడా ప్రధాని పార్లమెంటులో చేసిన వ్యాఖ్యల తర్వాత, విదేశాంగ మంత్రి మెలానీ జోలీ మాట్లాడుతూ, కెనడా భారత దౌత్యవేత్త పవన్ కుమార్ రాయ్‌ను దేశం నుంచి పంపించివేస్తున్నట్లు చెప్పారు. భారత ప్రభుత్వానికి, ఖలిస్తానీ టెర్రరిస్టు, కెనడా పౌరుడు హర్దీప్ సింగ్ నిజ్జార్(Hardeep Singh Nijjar) హత్యకు మధ్య ఉన్న సంబంధాన్ని ఆ దేశ భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో(justin trudeau) చెప్పిన తర్వాత ఇది జరిగింది. ఈ క్రమంలో ఇండో-కెనడియన్ కమ్యూనిటీకి చెందిన కొందరు భయాందోళనకు గురవుతున్నారని తనకు తెలుసునని ట్రూడో చెప్పారు. ఈ క్రమంలో వారు ప్రశాంతంగా ఉండాలని పిలుపునిచ్చారు. మరోవైపు నిజార్ కేసులో ఎలాంటి ప్రమేయం లేదని భారత్(bharat) ఇప్పటికే తోసిపుచ్చింది.
బ్రిటీష్ కొలంబియా సర్రేలోని సిక్కు కేంద్రం వెలుపల జూన్ 18న ఖలిస్తాన్ అని పిలువబడే స్వతంత్ర సిక్కు ప్రాంతానికి చెందిన హర్దీప్ సింగ్ నిజ్జార్‌పై కాల్పులు జరిగాయి. ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు నిజార్‌ను కాల్చి చంపారు. అయితే నిజార్ బ్రిటిష్ కొలంబియా ప్రసిద్ధ సిక్కు నాయకుడు, ఖలిస్తాన్ మద్దతుదారుడు. ఖలిస్తాన్ మద్దతుదారులు భారతీయ(bharat) పంజాబ్‌ను సిక్కులకు ప్రత్యేక, స్వయం ప్రతిపత్తి కలిగిన దేశం కావాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఖలిస్తాన్ త్వరలోనే స్వయం ప్రతిపత్తి గల దేశంగా అవతరించబోతుందని పలువురు అంటున్నారు. అయితే అతని కార్యకలాపాల వల్ల స్థానికుల ప్రాణాలకు ముప్పు ఉందని పలువురు చెబుతున్నారు. ఉగ్రవాద బృందానికి నాయకత్వం వహించిన అతన్ని భారతదేశం ఇప్పటికే “ఉగ్రవాదిగా” పరిగణించింది.