»Canadian Scientists Warn That Zombie Deer Disease Is Spreading Rapidly
Zombie Deer Disease: ముంచుకొస్తున్న మరో ముప్పు.. వేగంగా విస్తరిస్తున్న జాంబీ డీర్ డిసీజ్
వేగంగా వ్యాపిస్తున్న జాంబీ డీర్ డిసీజ్ పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ శాస్త్రవేత్తలు హెచ్చిరిస్తున్నారు. ఈ వ్యాది సోకిన ఏ జంతువైన మరణించాల్సిందే. ఇది మానవులకు సోకే ప్రమాదం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Canadian scientists warn that zombie deer disease is spreading rapidly
Zombie Deer Disease: ప్రకృతి విపత్తులే కాకుండా ప్రాణంతమైన వ్యాదులు కూడా మానవాళిని వణికిస్తున్నాయి. తాజాగా మరో మహమ్మారి ప్రపంచంపై దండయాత్రకు సిద్ధమైంది. జాంబీ డీర్ డిసీజ్ అత్యంత వేగంగా వ్యాపిస్తోందని, మానవులు అప్రమత్తంగా ఉండాలని కెనడా(Canada ) శస్త్రవేత్తలు(scientists) హెచ్చిరిస్తున్నారు. జాంబీ డీర్ డిసీజ్( zombie deer disease)ను క్రోనిక్ వేస్టింగ్ డిసీజ్(Chronic wasting disease) అని అంటారు. అత్యంత ప్రమాదకరమైన ఈ వ్యాది సోకిన ఏ జంతువైనా మరణించాల్సిందే. అమెరికాలో ఈ వ్యాది బయటపడింది. జనవరి చివరి వారంలో రెండు కేసులు నమోదు అయ్యాయి. వెంటనే అప్రమత్తం అయిన బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ అడ్డుకట్టు చర్యలు ప్రారంభించింది.
అంతే కాకుండా రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జింక, దుప్పి ఇతర జంతువులకు పరీక్షలు చేయాలని అధికారులను అదేశించారు. ఎందుకంటే ఈ వ్యాది వచ్చిన జంతువులు చొంగకార్చడం, తూలడం, శక్తిని కొల్పోయి ఉంటాయి. ప్రొటీన్ల మిస్ఫోల్డ్ కారణంగా ఈ వ్యాది వస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రొటీన్లు సరైన ఆకృతి సంతరించుకోకపోవడాన్ని ప్రియాన్స్ అంటారు. ప్రియాన్స్ కేంద్ర నాడీవ్యవస్థ ద్వారా ప్రయాణించి మెదడు కణజాలం, అవయవాల్లోకి చొరబడి విచ్ఛిన్నం చేస్తుంది. అందుకే జంతువు మనుపటిలా కాకుండా వింతగా ప్రవర్తిస్తుంది. తూలడం, చొంగ కార్చడం వంటి లక్షణాలు ఉంటాయి. అందుకే దీన్ని జాంబీ డీర్ డిసీజ్ అంటారు. అమెరికాలోని యెల్లోస్టోన్ నేషనల్ పార్క్లో మొదటి సారి ఈ వ్యాధి బయటపడింది. అయితే ఇది నేరుగా మానవులకు సోకుతుందన్న ఆధారాలు లేవు కానీ దాన్ని అంత తేలికగా తీసేయలేమని శాస్త్రవేత్తలు అంటున్నారు.