»Diabetes With Pollution What Are The Scientists Saying
Health Tips: పొల్యూషన్ తో షుగర్ వ్యాధి.. శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే?
మారుతున్న జీవనశైలీలో భాగంగా మనిషి ఆరోగ్యం కూడా చాలా మార్పులకు గురవుతుంది. నేటి పరిస్థితుల్లో చాలా మందిలో డయాబెటీస్‌కు కారణం మనిషి జీవిన విధానమే అని తెలిసిందే. ఈ మేరకు వైద్యనిపుణులు ఓ విషయాన్ని తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం అందరిలో ఆందోళనకు గురిచేస్తుంది.
Diabetes with pollution.. What are the scientists saying?
Health Tips: మనిషి జీవిన శైలి మారింది. తినే ఫుడ్ మాత్రమే కాదు, అలవాట్లు కూడా మారాయి. అందువలనే శరీరంలో కొన్ని మార్పులు జరుగుతున్నాయి. అందుకే ఆరోగ్య నిపుణులు కొన్ని విషయాలలో ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఇన్ని రోజులు శారీరక శ్రమ లేకపోవడం, జంక్ ఫుడ్, అధిక కొవ్వు పదార్థాలే డయాబెటిస్‌కు కారణం అని అనుకున్నాము కానీ.. వాతావరణంలోని కాలుష్యం సైతం షుగర్ వ్యాధికి కారకమౌతొందని పరిశోధకులు తాజాగా చెప్పారు. గాలిలో ఉన్న పర్టిక్యులేట్ మేటర్ (పీఎం) 2.5 కలుషిత కణాల వలనే ఈ సమస్య అని నిర్ధారించారు. ప్రఖ్యాత మెడికల్ జర్నల్ లాన్సెట్ నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెలుగు చూశాయి.
పర్టిక్యులేట్ మేటర్ (పీఎం) 2.5 కలుషిత కణాలు చాలా చిన్న కణాలు. అవి వాహనాలు, చెత్తా చెదారాన్ని కాల్చడం ద్వారా వచ్చే పొగ, ధూళి వంటి వాటిలో పీఎం 2.5 కణాలతో పాటు చాలా విషవాయువులు ఉంటాయి. దీన్ని అధికంగా పీల్చడం వలన శరీరంలోని నాడీ వ్యవస్థపై ప్రభావం పడుతోంది. శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను పెంచడం వలన బ్లడ్‌లో షుగర్ లెవల్స్ అధికంగా పెరుగుతాయి. ఈ కలుషితానికి అధికంగా గురైతే టైప్–2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 20 శాతం ఉందని నిపుణులు తెలిపారు. ఈ డయాబెటిస్ వలన కిడ్నీ వ్యాధుల సమస్య మొదలవుతుంది. వీటి భారిన పడకుండా ఉండేందుకు మాస్కులు, ఎయిర్ ఫిల్టర్లను వాడటం మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.