Cloves Health Benefits : ఇటీవల కాలంలో ఏ ఇంట్లో చూసినా డయాబెటీస్ రోగులు కనిపిస్తున్నారు. షుగర్ని తగ్గించుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. ఆహారంలో మార్పులు చేసుకోవడం, వ్యాయామాలు చేయడం, మందులు వేసుకోవడం లాంటివి అన్నీ చేస్తూనే ఉంటారు. అయినా కొంత మందికి షుగర్లో(CLOVES) ఫ్లక్చువేషన్స్ ఉంటూ ఉంటాయి. అలాంటి వారు లవంగాలను తప్పకుండా ప్రయత్నించవచ్చని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.
మనకు తెలిసినట్లే లవంగాల్లో(CLOVES) బోలెడు ఔషధ గుణాలు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, విటమిన్లలాంటివీ పుష్కలంగా ఉంటాయి. వీటన్నింటికీ మించి లవంగాల్లో యూజినాల్ అన్నే సమ్మేళనం ఉంటుంది. ఇది మధుమేహాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. చక్కెర స్థాయిల్ని సమంగా ఉంచేందుకు సహకరిస్తుంది. అందుకనే లవంగాలను చక్కెర వ్యాధిగ్రస్తులు తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవాలి.
గిన్నెలోకి గ్లాసుడు నీటిని తీసుకోండి. స్టౌపై పెట్టండి. అందులో ఏడెనిమి లవంగాలు(CLOVES) వేయండి. మంట వెలిగించి ఆ నీటిని మరిగించడండి. తర్వాత ఆ నీటిని వడగట్టుకోండి. వాటిని గోరు వెచ్చగా మారాక తాగండి. ఇలా మూడు నెలలపాటు చేసి చూడండి. మంచి రిజల్ట్ కనిపించే అవకాశాలు ఉంటాయి. లేదంటే మరో విధంగానూ వీటిని తీసుకోవచ్చు. రోజుకు రెండు, లవంగాలను నోట్లో వేసుకుని మెల్లగా నమిలి తినండి. ప్రయోజనం ఉంటుంది. 2018లో జరిగిన ఓ పరిశోధనలోనూ ఈ విషయాలు వెల్లడయ్యాయి.