PM Modi: తెలంగాణలో మేడారం జాతర ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సోషల్ మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు తెలుగులో శుభాకాంక్షలు తెలిపారు. గిరిజనుల అతిపెద్ద పండుగలలో ఒకటి మేడారం జాతర. మన సాంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తిగా నిలిచే చైతన్యవంతమైన వ్యక్తీకరణ అయిన ఈ సమ్మక్క-సారక్క మేడారం జాతర ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలు. ఈ జాతర భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక. మనం సమ్మక్క-సారక్కలకు ప్రణమిల్లుదాం, వారు అభివ్యక్తీకరించిన ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తుచేసుకుందామని ప్రధాని మోదీ తెలిపారు.
గిరిజనుల అతిపెద్ద పండుగలలో ఒకటైన,మన సాంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తిగా నిలిచే చైతన్యవంతమైన వ్యక్తీకరణ అయిన ఈ సమ్మక్క-సారక్క మేడారం జాతర ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలు. ఈ జాతర భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక. మనం సమ్మక్క-సారక్కలకు ప్రణమిల్లుదాం, వారు…
తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం మహా జాతర ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. సమ్మక్క, సారలమ్మలు వనం వీడి జనారణ్యంలోకి వచ్చి గద్దెలపై కొలువుదీరనున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మేడారంలో మహా జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. భక్తులు మొక్కులు తీర్చుకోవడానికి భారీగా తరలి వస్తారు. ఈ నెల 24 వరకు మేడారం జాతర జరగనుంది.