bus and tractor collision in ap anantapur district four people died
Bihar Road Accident : అతి వేగానికి ఏకంగా తొమ్మిది ప్రాణాలు బలయ్యాయి. లారీ, ఆటోలు ఒకదాన్ని ఒకటి వేగంగా ఢీ కొనడంతో తొమ్మిది మంది మరణించారు. పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన బీహార్(Bihar)లో జరిగింది. బీహరోరా గ్రామం దగ్గర ఉన్న లఖిసరాయ్-సికంద్ర రోడ్డుపై ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…15 మందితో ఉన్న టెంపో ఆ రోడ్డులో వస్తోంది. దానికి వ్యతిరేక దిశలో లారీ వేగంగా వస్తోంది. రెండూ ఒకదాన్ని ఒకటి గుద్దుకోవడంతో అక్కడికక్కడే తొమ్మిది మంది ప్రాణాలు వదిలారు. గాయపడిన వారిని దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతంలో ఈ దారుణ రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. మృతుల్లో ఎక్కువ మంది ముంగేర్‌కు చెందిన వారని అన్నారు. వారిని వీర పాశ్వాన్, వికాస్ కుమార్, విజయ్‌కుమార్, దిబానా పాశ్వాన్, అమిత్ కుమార్, మోను కుమార్, కిసాన్ కుమార్, మనోజ్ గోస్వామిలుగా గుర్తించినట్లు వెల్లడించారు.