»Air India Receives The Countrys First Airbus A350 900 Aircraft
Bharat:కు ఫస్ట్ ఎయిర్‌బస్ A350-900
భారత్‌లో తొలి ఎయిర్‌బస్ ఏ350 ఎయిర్‌క్రాఫ్ట్‌ను అందుకున్నట్లు ఎయిర్ ఇండియా శనివారం (డిసెంబర్ 23న) తెలిపింది. ఇటువంటివి ఇంకా 19 అర్డర్ చేసినట్లు సంస్థ చెప్పింది. అయితే ఈ ప్లైట్ ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చుద్దాం.
Air India receives the country’s first Airbus A350-900 aircraft
భారతదేశంలో మొట్టమొదటి ఎయిర్‌బస్ A350-900 విమానాన్ని ఎయిర్ ఇండియా అందుకుంది. విమానాల తయారీ సంస్థ శనివారం దీన్ని డెలివరీ చేసింది. ఎయిర్ ఇండియా ఇంకా ఇలాంటివి 19 విమానాలను అర్డర్ చేయడం విశేషం. టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాలో చేస్తున్న ప్రధాన మార్పులలో ఇది కూడా ఒకటి కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ విమానం ఫ్రాన్స్‌లోని టౌలౌస్ నుంచి శనివారం మధ్యాహ్నం 1.46 గంటలకు భారత్‌కు చేరుకుంది. ఈ విమానంలో శిక్షణ తీసుకున్న భారతీయ పైలట్లలో ఎయిర్ ఇండియా సీనియర్ కమాండర్ కెప్టెన్ మోనికా బాత్రా వైద్య కూడా ఉన్నారు. విమానంలో పరిశీలకురాలిగా మోనికా కూడా ఉంది.
First look inside our stunning A350-900!
28 luxurious and private suites with full-flat beds in Business Class, 24 Premium Economy seats with extra legroom and comfort, and 264 spacious & ergonomic Economy Class seats.
ఈ సందర్భంగా ఎయిర్ ఇండియాలో మనందరికీ ముఖ్యమైన రోజు అని ఎయిర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మేనేజింగ్ డైరెక్టర్ క్యాంప్‌బెల్ విల్సన్ అన్నారు. ఈ విమానం సుదూర ప్రయాణంలో గొప్ప అనుభూతిని ఇస్తుందని ఆయన అన్నారు. అందులో ప్రయాణించడం వల్ల అపూర్వమైన సౌకర్యాలు లభిస్తాయని చెప్పారు. ఎయిర్ ఇండియాకు చెందిన A350 విమానం జనవరి 2024లో దాని వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభిస్తుందని వెల్లడించారు. ఎయిర్ ఇండియాకు ఇచ్చిన A350-900 విమానాలను కాలిన్స్ ఏరోస్పేస్ రూపొందించింది. ఇది 316 సీట్లతో మూడు తరగతి క్యాబిన్లను కలిగి ఉంది. ఇది పూర్తి ఫ్లాట్ బెడ్లతో 28 ప్రైవేట్ బిజినెస్ క్లాస్ సూట్లు, 24 ప్రీమియం ఎకానమీ సీట్లు, అదనపు లెగ్‌రూమ్, అనేక ఇతర ప్రత్యేక ఫీచర్లతో 264 ఎకానమీ సీట్లు ఉన్నాయి. అన్ని సీట్లు తాజా తరం పానాసోనిక్ eX3 ఇన్-ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్, మెరుగైన అనుభవాన్ని అందించడానికి HD స్క్రీన్లతో అమర్చబడి ఉంటాయి.