ఐఐటీలు(IIT),ఐఐఎంలు ప్రముఖ విద్యా సంస్థల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులను క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా కార్పొరేట్ సంస్థలు నియమించుకుంటాయి.ఐఐటీ-బాంబేలో ఇటీవలే నిర్వహించిన ప్లేస్ మెంట్స్(Placements) డ్రైవ్లో రికార్డులు నమోదయ్యాయి.ప్లేస్ మెంట్లు విద్యార్థులకు వచ్చే వేతన ప్యాకేజీల్లో ఐఐటీ (IITs)లు ఏటా తమ రికార్డు తామే తిరగరాస్తుంటాయి. ఈసారి కూడా అదే జరిగింది. ఓ గ్రాడ్యుయేట్ విద్యార్థికి అంతర్జాతీయ సంస్థ గరిష్టంగా రూ.3.7 కోట్ల వార్షిక వేతన ప్యాకేజీ (Salary Package) ఆఫర్ చేయగా, దేశీయ సంస్థ రూ.1.7 కోట్ల వేతన ప్యాకేజీ లభించింది. ఈ రెండు ఆఫర్లను సదరు విద్యార్థులు అంగీకరించినట్లు తెలిపింది. అయితే, వారి పేర్లను మాత్రం సంస్థ బహిర్గతం చేయలేదు.
గత ఏడాది ఐఐటీ బాంబే (IIT Bombay Placements)కు చెందిన ఓ విద్యార్థికి అంతర్జాతీయ కంపెనీ నుంచి రూ.2.1 కోట్ల ప్యాకేజీ లభించింది. దేశీయ కంపెనీ నుంచి రూ.1.8 కోట్ల వార్షిక వేతన ఆఫర్ వచ్చింది. 2022- 23 ప్రీప్లేస్మెంట్లలో మొత్తం 300 ఆఫర్లు రాగా.. 194 మంది వాటిని అంగీకరించినట్లు ఐఐటీ బాంబే (IIT Bombay) వెల్లడించింది. వీరిలో 16 మందికి రూ.కోటికి పైగా వార్షిక ప్యాకేజీ లభించినట్లు తెలిపింది.గతేడాది అంతర్జాతీయ సంస్థ గరిష్టంగా రూ.2.1 కోట్ల వేతన ప్యాకేజీ ఆఫర్ చేస్తే, జాతీయ సంస్థ రూ.1.8 కోట్లు ఆఫర్ చేసింది. అంతర్జాతీయ వేతన ప్యాకేజీ గణనీయంగా పెరిగితే, దేశీయ ప్యాకేజీ స్వల్పంగా తగ్గింది. గతేడాదితో పోలిస్తే సగటు వేతన ప్యాకేజీతో ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ సెక్టార్ సంస్థలు అత్యధికులను నియమించుకున్నాయి. ఐటీ, సాఫ్ట్ వేర్ (Software) నియామకాలు తగ్గుముఖం పట్టాయి.