ఫేస్బుక్(Facebook).. వాట్సాప్.. ఇన్స్టాగ్రామ్.. ట్విటర్. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వీటి వినియోగం చాలా ఎక్కువగా ఉంది. మొదట్లో భావస్వేచ్ఛా ప్రకటనకు ఈ సామాజిక మాధ్యమాలు ఎంతో ఉపయోగపడ్డాయి. కానీ ఇవే వేదికలు ఇప్పుడు దారుణమైన నేరాలకు, మోసాలకు కారణమవుతున్నాయి. సోషల్ మీడియా(Social media)లో మొదలయ్యే పరిచయాలు ఎటెటో దారితీస్తున్నాయి. కొందరు ఎదుటివారిని దారుణంగా చంపేస్తుంటే.. మరికొందరు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా, గుంటూరు(Guntur)లో మరో ఫేస్ బుక్ మోసం బయటపడింది.. ప్రేమ -పెళ్లి పేరుతో హైదరాబాద్ (Hyderabad)కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న యువతి నుంచి రూ.12 లక్షల వరకు వసూలు చేశారు గుంటూరుకు చెందిన గురు ప్రసాద్ అనే వ్యక్తి..సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్లో వీరి పరిచయం మొదలైంది..
తాను బెంగళూరులో సాఫ్ట్వేర్ (Software) డెవలపర్‌గా పనిచేస్తున్నానంటూ సదరు యువతితో మాటలు కలిపాడు గురుప్రసాద్.. అలా వారి పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది.. కంత్రీ మైండ్‌తో ఉన్న గురుప్రసాద్(Guruprasad).. తన ప్లాన్ ప్రకారం.. పెళ్లి విషయాన్ని తెరపైకి తీసుకొచ్చాడు.. త్వరలోనే మ్యారేజ్ చేసుకుందామని నమ్మించాడు.. యువతి కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండడంతో.. సాఫ్ట్వేర్ డెవలపర్ అయితే.. బాగానే ఉంటుందని నమ్మింది.. ఇక, ఆ యువతి నుంచి దాదాపు రూ.12 లక్షల వరకు తీసుకున్నారు.. ఆ తర్వాత మొఖం చాటేశాడు.. తాను మోసపోయినట్టు (Cheated) గుర్తించిన యువతి.. ఈ ఘటనపై అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.. గురు ప్రసాద్ కు ఇప్పటికే పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తుండగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.