Apple WWDC 2023 దాని వార్షిక ఈవెంట్లో భాగంగా Apple కీలక ప్రకటన చేసింది. ఆపరేటింగ్ సిస్టమ్ iOS 17 గురించి అప్ డేట్ ఇచ్చింది. దీంతోటాపు watchOS 10, iPadOS 17లను ఆవిష్కరించింది. మరోవైపు సరికొత్త గాడ్జెట్లను కూడా రిలీజ్ చేసింది. ఇక iOS 17 ఆపరేటింగ్ సిస్టమ్ చాలా ఆసక్తికరమైన ఫీచర్లను కలిగి ఉంది. కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌తో వినియోగదారులు తమ సొంత చిత్రాలను స్టిక్కర్లుగా మార్చుకోవచ్చు. అదనంగా దాని కీప్యాడ్ కూడా మార్చబడింది. ఇది టైప్ చేయడానికి Apple పరికరాలను ఉపయోగించడం చాలా సులభం చేస్తుంది.
ఈ కొత్త వెర్షన్‌తో నేమ్ డ్రాప్ ఫీచర్, ఫేస్‌టైమ్ వీడియో మెసేజ్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు ఐఫోన్స్, ఐప్యాడ్స్ వంటి డీవెజ్ లతో సులభంగా కనెక్ట్ కావచ్చని పేర్కొంది. అత్యంత కీలకమైన స్టాండ్‌బై మోడ్ అదనంగా అందించబడుతుంది. ఈ స్టాండ్‌బై మోడ్‌లో ఐఫోన్ ఛార్జింగ్ అయినప్పుడు లాక్ స్క్రీన్ ఉంటుంది. ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి పక్కన పెట్టినప్పుడు ఈ ఫీచర్ స్వయంచాలకంగా పనిచేయడం ప్రారంభమవుతుంది. అదనంగా జర్నలింగ్ యాప్ కూడా అభివృద్ధి చేయబడింది. ఇది వినియోగదారుల రోజువారీ రొటీన్లు, వారి చర్యల గురించి సూచిస్తుంది. ఇది వినియోగదారుల కోసం అందించింది. దీంతోపాటు చిత్రాలు, వీడియోలు యాప్ గోప్యత గురించి ఆందోళన చెందకుండా సెక్యురిటీ ఫీచర్లను కూడా పెంచింది. దీంతోపాటు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ సపోర్ట్ కూడా ఉంది.
నేమ్ డ్రాప్ యాపిల్ ప్రవేశపెట్టనున్న మరో ఫీచర్. ఇద్దరు యాపిల్ వినియోగదారులు తమ దగ్గరలో ఉన్నప్పుడు ఎయిర్‌డ్రాప్ ద్వారా ఫైల్‌లను మార్చుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా సంప్రదింపు సమాచారాన్ని మార్పిడి చేసుకోవచ్చు. మీరు మీ ప్రాంతంలోని Apple వినియోగదారుల సంప్రదింపు సమాచారాన్ని అడగవచ్చు. ఇరు పక్షాలు అంగీకరిస్తే వారి సంప్రదింపు సమాచారం మార్పిడి సులభంగా చేసుకోవచ్చు.
ఈ గాడ్జెట్లకు iOS 17 అప్డేట్ వర్తించనుంది
Apple iPhone 14 Pro/14 Pro Max
iPhone 14, iPhone 14 Plus
iPhone SE(2022)
iPhone 13, 13 మినీ, 13 ప్రొ, 13 ప్రొ మాక్స్
iPhone 12, 12 మినీ, 12 ప్రొ, 12 ప్రొ మ్యాక్స్
iPhone 11, 11 Pro, 11 Pro Max
iPhone XS/XS Max, iPhone XR