ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగు టెస్టును డ్రా చేసుకునేందుకు టీమిండియా పోరాడుతోంది. రెండో ఇన్నింగ్స్లో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. గిల్ (78*), కేఎల్ రాహుల్ (87*) రాణించారు. భారత్ గెలవాలంటే ఇంకా 137 పరుగులు సాధించాల్సి ఉంది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 669 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.