HYD: పలురంగాల్లో రాణించిన ప్రముఖులకు అటల్ భారత్ స్పోర్ట్స్, కల్చర్ అసోసియేషన్ ఏటా పురస్కారాలు ఇస్తోంది. 2025 పురస్కారాల్లో తెలంగాణ నుంచి ఇద్దరు ఎంపిక కాగా.. వీరిలో ఒకరు హైదరాబాద్‌కు చెందిన యువస్విమ్మర్ పర్ణిక అనన్య జయని ఉన్నారు. దిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఒలింపియన్ అశోక్ ధ్యాన్‌చంద్, ఎంపీలు రవికిషన్, మనోజ్ తివారీ అవార్డులు అందజేశారు.