MDK: కౌడిపల్లిలో ఎరువుల దుకాణాలను అదనపు వ్యవసాయ సంచాలకులు విజయ్ కుమార్ శనివారం సాయంత్రం తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి, నిలువల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎరువుల వాడకం, లభ్యతపై రైతులతో ముచ్చటించారు. డీలర్లు ఎరువులు MRP ధరలకే అమ్మకాలు జరపాలని, నిభందనలు ఉల్లంఘించి అమ్మకాలు జరిపినట్లయితే వారి పైన శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు