మేడ్చల్: ఉప్పల్, చిల్కానగర్, రాంనగర్, మల్లికార్జున్‌నగర్, గణేష్‌నగర్, ఆదర్శనగర్, శాంతినగర్, భరత్‌నగర్ ప్రాంతాల్లో బోనాల ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. అమ్మవార్లకు బోనాలు సమర్పించేందుకు భక్తులు క్యూలైన్లలో నిలబడి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై మాధవరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.