సత్యసాయి: హిందూపురం ఎంపీ పార్థసారథి నివాసంలో ఆదివారం శ్రీ సత్యసాయి జిల్లా DRDA ప్రాజెక్టు డైరెక్టర్ కె.ఎన్. నరసయ్య మరియు సెంట్రల్ డిస్ట్రిక్ట్ టీంతో కలిసి జిల్లా గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు, ప్రస్తుత పురోగతి, భవిష్యత్ ప్రణాళికలపై సమగ్రంగా చర్చించారు.