సత్యసాయి: ఓబులదేవరచెరువు మండలంలోని నల్లచెరువుపల్లి గ్రామంలో గ్రామ దేవత శ్రీ గంగమ్మ తల్లికి ఆదివారం ప్రత్యేక అలంకారంతో పాటు పసుపు, కుంకుమతో అభిషేకం చేసి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి జ్యోతులు, బోనాలు సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించగా, గ్రామస్థులు, భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.