NZB: అంబం నుంచి రుద్రూర్కు వెళ్లే రోడ్డు పూర్తిగా గుంతల మయంగా మారింది. చిన్నపాటి వర్షానికే రోడ్డుపై ఉన్న గుంతలలో వర్షపు నీరు చేరడంతో ఈ గుంతల్లో పడి ప్రమాదాలు జరిగే అవకాశముంది. ఈ దారి గుండా ప్రయాణించాలంటే ఆటోలు, ద్విచక్ర వాహనాలలో వెళ్ళే ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చివేయాలని స్థానికులు కోరుతున్నారు.