కోనసీమ: బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలిగా చిలకమర్రి కస్తూరి నియమితులయ్యారు. ఈ సందర్భంగా అమలాపురంలో ఆదివారం మిత్రమండలి సభ్యులు ఆమెను సత్కరించారు. కస్తూరి అనేక సంవత్సరాలుగా సామాజిక సేవా రంగంతో పాటు పార్టీ కార్యకలాపాల్లో నిష్ఠగా పనిచేశారని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పేరి లక్ష్మీనరసింహం, కామేశ్వర్, లలిత పాల్గొన్నారు.