BHPL: మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజీలో వరద ఉద్ధృతి నిలకడగా కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 6 గంటలకు 3,41,350 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైనట్లు నీటిపారుదల శాఖ అధికారులు బులిటెన్లో వెల్లడించారు. శనివారం ఉదయం, సాయంత్రం కూడా ఇదే స్థాయిలో వరద ప్రవాహం కొనసాగినట్లు తెలిపారు.