కృష్ణా: కంకిపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుదిమల్ల రవీంద్ర ప్రసాద్ శనివారం రాత్రి మృతి చెందారు. పార్టీకి కార్యకర్తగా ప్రారంభమై, నిబద్ధతతో ముందుకు సాగిన ఆయన మండల అధ్యక్షుడిగా ఎన్నో సేవలు అందించారని కార్యకర్తలు తెలిపారు. గతంలో ఆయన వివిధ పదవులలో సేవలు అందించారని పేర్కొన్నారు. ఆయన మృతితో టీడీపీ శ్రేణుల్లో విషాదం అలుముకుంది.