ఏలూరు: వర్జీనియా పొగాకు ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. శుక్రవారం వరకు కేజీకి గరిష్ట ధర రూ.390లు ఉండగా శనివారం ఒకేసారి కేజీకి రూ. 20 తగ్గింది. దీనిని జంగారెడ్డిగూడెం పొగాకు బోర్డు పరిధిలో ఉన్న రైతు సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ఒకేసారి రూ. 20 తగ్గడంతో రైతులు భారీ స్థాయిలో నష్టాలు చవి చూడాల్సి వస్తుందని వాపోతున్నారు.