»Nara Lokesh Visakhapatnam Has Been Turned Into A Sad City
Nara Lokesh: విశాఖను విషాదపట్నంగా మార్చేశారు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ రోజు ఉదయం సింహాచలం వెళ్లి అప్పన్నస్వామిని దర్శించుకున్నారు. తర్వాత నగరంలోని తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన శంఖారావం సభలో మాట్లాడారు.
Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ రోజు ఉదయం సింహాచలం వెళ్లి అప్పన్నస్వామిని దర్శించుకున్నారు. తర్వాత నగరంలోని తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన శంఖారావం సభలో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులమయం చేసిందన్నారు. ఎంతో అందమైన విశాఖపట్నాన్ని విషాదపట్నంగా మార్చేశారని లోకేష్ అన్నారు. నగరానికి చంద్రబాబు నెలకొక ఐటీ కంపెనీ తీసుకొచ్చారన్నారు. ఇప్పుడు రోజుకో భూకుంభకోణం, హత్యలు, కిడ్నాప్‌లు జరుగుతున్నాయని లోకేష్ ఆరోపించారు.
లాలూచీతో విశాఖ ఉక్కును ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు నెలల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది. అధికారంలోకి వచ్చాక విశాఖ ఉక్కును అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటాం. రైల్వే జోన్, నగరానికి మెట్రో ప్రాజెక్టు హామీలను జగన్ నెరవేర్చలేదు. చంద్రబాబు సూపర్-6 పేరుతో హామీలను ప్రకటించారు. ఐదేళ్లలో యువతకు 20లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఏటా డీఎస్సీ ప్రకటిస్తాం. నిరుద్యోగులకు రూ.3వేల నిరుద్యోగ భృతి, 18-59 ఏళ్లలోపు మహిళలకు నెలకు రూ.1500 అందజేస్తామని లోకేశ్ తెలిపారు.