Madhya Pradesh: మధ్యప్రదేశ్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ గర్భిణిపై సామూహిక అత్యాచారం చేసి తర్వాత కిరోసిన్ పోసి నిప్పు అంటించారు. 80 శాతం కాలిన గాయాలైన ఆ గర్భిణి ఆసుపత్రిలో చికిత్స చెందుతుంది. ఆ గర్భవతి భర్త తనపై అత్యాచారానికి పాల్పడినట్లు చాంద్ కా పురా గ్రామానికి చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గర్భిణి భర్త జైలుకి వెళ్లాడు. అయితే బెయిల్ మీద బయటకు వచ్చాడు. అయితే తన భర్త మీద అత్యాచార ఆరోపణలు చేసిన మహిళతో రాజీ కుదుర్చుకునేందుకు గర్భిణి వెళ్లింది.
గర్భిణిపై ఆ మహిళ భర్తతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత ఆ మహిళ, అత్యాచారం చేసిన ముగ్గురు వ్యక్తులు కలిసి బాధితురాలిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. ఎక్కువ శాతం కాలి గాయాలైన ఆమెను గ్వాలియర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె చావు బ్రతుకుల మధ్య ఉంది. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.