»Suhani Bhatnagar The Dangal Actress Passed Away At The Age Of 19 Due To Side Effects
Suhani Bhatnagar: సైడ్ ఎఫెక్ట్స్ వల్ల 19 ఏళ్లకే ‘దంగల్’ నటి కన్నుమూత!
బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. 19 ఏళ్లకే దంగల్ సినిమాలో అమీర్ ఖాన్ కూతురుగా నటించిన సుహాని భట్నాగర్ కన్నుముసింది. దీంతో ఈ వార్త షాకింగ్‌గా మారింది. మరి సుహానీ చావుకు గల కారణాలేంటి?
Suhani Bhatnagar: బాలీవుడ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 2016లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘దంగల్’ మూవీలో అమీర్ ఖాన్ కూతురిగా నటించిన సుహానీ భట్నాగర్ 19 ఏళ్లకే కన్నుమూసింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌లో గత కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతున్నారు. అయితే.. సుహానీ వాడుతున్న మందులు రియాక్షన్ కారణంగా ఆమె చనిపోయినట్లుగా వైద్యులు వెల్లడించారు. దీంతో.. 19 ఏళ్ల సుహాని మరణావార్త సినీ పరిశ్రమను దిగ్బ్రాంతికి గురి చేసింది.
బాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు, ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు. శరీరమంత నీరు పట్టడం వల్లే సుహానీ మృతి చెందినట్టు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. కొంత కాలం క్రితం సుహానీకి యాక్సిడెంట్ అయింది. ఆ ప్రమాదంలో ఆమె కాలు విరిగిపోయింది. కాలు ఫ్యాక్చర్కి చికిత్స పొందుతున్న ఆమెపై ఉపయోగించిన మెడిసన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆమెను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చెర్పించారు. అక్కడ చికిత్స పొందుతున్న సుహాని ఫిబ్రవరి 17న ఆరోగ్యం క్షిణించడంతో తుదిశ్వాస విడిచింది.
అమీర్ ఖాన్ దంగల్ సినిమాలో చిన్నప్పటి బబితా ఫోగట్ పాత్రలో నటించింది సుహానీ. ఈసినిమాలో సుహానీ నటనకు ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత సినిమాలతో పాటు పలు టెలివిజన్ వాణిజ్య ప్రకటనల్లో కూడా నటించింది సుహానీ. ఏదేమైనా 19 ఏళ్ల చిన్న వయసులోనే సుహానీ ప్రాణాలు కోల్పోవడం.. షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.