కుదిరినప్పుడల్లా కప్పుడు కాఫీ తాగేస్తున్నారా? బరువు పెరిగిపోయే ప్రమాదం ఉంది జాగ్రత్త. అసలు కాఫీని ఎలా తాగాలి? రోజుకు ఎంత తాగాలి? ఎలా తాగితే ఆరోగ్యకరం? తెలుసుకుందాం వచ్చేయండి.
Coffee Side Effects : కాఫీ ఘుమఘుమలకు ఫిదా అయిపోని వారంటూ ఉండరేమో. అందుకనే ఏ మాత్రం స్ట్రెస్‌గా అనిపించినా వెంటనే ఓ కప్పుడు కాఫీని సిప్ చేసేస్తూ ఉంటారు. అయితే కప్పుల కప్పుల కాఫీని(COFFEE) ఇలా పొట్టలో పోసేసుకుంటూ ఉండటం వల్ల బరువు పెరిగిపోయే ప్రమాదం లేకపోలేదు. అందులో పంచదార, క్రీం, కాఫీ పొడి లాంటివి అన్నీ ఉంటాయి. అలాంటి కాఫీని తాగడం వల్ల ఎక్కువ క్యాలరీలూ మనలో చేరిపోతాయి. అలాగే కాఫీ పొడిలో అధిక మొత్తం కెఫీన్ సైతం ఉంటుంది. ఇవన్నీ కలిసి మనకు అనారోగ్య సమస్యలను తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. నిద్రలేమి, మధుమేహం, బరువు పెరగడం లాంటి ఇబ్బందులు కలగవచ్చు.
అందుకనే సాధారణంగా కాఫీ తాగాలని అనుకునే వారు రోజుకు ఒక కప్పు మించి తాగకూడదు. అలాగే ఆరోగ్యంగా తాగాలని చూసేవారు బ్లాక్ కాఫీని(black COFFEE) ఎంచుకోవడం మంచిది. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. క్యాలరీలూ తక్కువగా ఉంటాయి. ఒక కప్పు బ్లాక్ కాఫీలో కేవలం రెండు క్యాలరీల శక్తి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇది తాగడం వల్ల బరువు పెరిగిపోతారేమోనన్న భయం అవసరం లేదు.
ఇలా బ్లాక్ కాఫీని తాగడం వల్ల దీనిలో ఉండే కెఫీన్ తాత్కాలికంగా జీవ క్రియను వేగవంతం చేస్తుంది. అందువల్ల ఎక్కువ క్యాలరీలు బర్న్ అవుతాయి. ఫలితంగా కొవ్వులు కరుగుతాయి. బరువు తగ్గేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. అలాగే ఈ బ్లాక్ కాఫీ ఆకలిని తగ్గిస్తుంది. ఫలితంగా మనం అతిగా తినకుండా ఉంటాం. అనవసరపు క్రేవింగ్స్ కలగకుండా ఉంటాయి. అయితే ఏ కాఫీని అయినా పరిమితంగానే తాగాలని గుర్తుంచుకోండి. ఎక్కువగా తాగడం అనారోగ్యకరమనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.