»Wearing Lipstick Can Be Dangerous For Your Health Know How
lipstick లిప్స్టిక్ అతిగా వాడుతున్నారా? ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్లే!
కొంత మంది అమ్మాయిలు రోజూ ముఖానికి మేకప్ వేసుకుంటారు. లిప్స్టిక్నీ వాడుతుంటారు. ఇలా పెదవులకు రోజూ రంగు వేసుకోవడం వల్ల చాలా దుష్ప్రభావాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..?
lipstick dangerous for your health : అతివలు తమ అదరాలను మరింత అందంగా మలుచుకోవడానికి తరచుగా లిప్స్టిక్ని పూసుకుంటూ ఉంటారు. కొందరూ డైలీ లిప్ స్టిక్ (lipstick) వాడనిదే బయటకు వెళ్లరు. అయితే తరచుగా ఇలా పెదవుల రంగుని వాడటం వల్ల, నాణ్యత లేని చౌకైన వాటిని ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి(health) ప్రమాదం పొంచి ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీలైనంత వరకు ఈ అలవాటును తగ్గించుకోమని అంటున్నారు.
లిప్స్టిక్స్లో, నాణ్యతలేని లిప్స్టిక్స్లో(lipstick ) సీసం, పెట్రో రసాయనాలు, కాడ్మియం, క్రోమియం లాంటి ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి. ఆ రంగును పెదవులకు పూసుకున్నప్పుడు అవి సాధారణంగానే నోటి గుండా లోపలికి ప్రవేశిస్తాయి. అయితే ఈ రసాయనాలు అన్నీ మన ఆరోగ్యానికి చేటు కలిగించేవే. సీసం మన నాడీ వ్యవస్థను ఎంతగానో ప్రభావితం చేస్తుంది. మెదడు చేసే పనులను సవ్యంగా చేయలేదు. పని తీరు మందగించి నిర్ణయాలను వేగంగా తీసుకోలేం.
సీసం వల్ల మూత్ర పిండాలూ దెబ్బ తినే అవకాశం లేకపోలేదు. అలాగే ఇది రక్తంలోకి ప్రవేశిస్తే హార్మోన్ల అసమతుల్యత చోటు చేసుకుంటుంది. సంతాన సమస్యలూ తలెత్తే ప్రమాదం ఉంటుంది. లిప్స్టిక్స్లో(lipstick ) ఉండే బిస్మత్ అక్సీ క్లోరైడ్, పారాబెన్స్ లాంటి పదార్థాలు క్యాన్సర్ కారకాలుగా పని చేస్తాయి. ఈ మధ్య కాలంలో అసలే క్యాన్సర్లు రోజు రోజుకీ ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటివి క్యాన్సర్ కణాల వ్యాప్తిని మరింత ప్రోత్సహిస్తాయి. కాబట్టి పెదవుల అందం మాట అటుంచితే ఆరోగ్యం(health) పాడైతే ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. అందుకనే కావాలనుకుంటే నెయ్య, వెన్న, తేనె లాంటి సహజమైన మాయిశ్చరైజర్లను పెదవులకు రాసుకోవడం ఉత్తమం. ఇవి అదరాలను తేమగా ఉంచి మంచిగా కనిపించేలా చేస్తాయి.