ఎట్టకేలకు పుష్ప3 గురించి జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పార్ట్ 3 ఉంటుందని చెప్పేశాడు బన్నీ. కానీ పుష్ప2 మామూలుగా ఉండదని అన్నాడు.
Pushpa 2: పుష్ప పార్ట్ 1కు మించి పుష్ప పార్ట్ 2 తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ప్రస్తుతం పుష్ప2 షూటింగ్ జరుగుతోంది. ఆగష్టు 15న రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అయితే.. చాలా రోజులుగా పుష్ప పార్ట్ 3 కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పార్ట్ 3 కన్ఫామ్ చేశాడు. పుష్ప సినిమాకు థర్డ్ పార్ట్ కూడా ఉంటుందని బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అల్లు అర్జున్ ప్రకటించాడు. బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పుష్ప సినిమాను స్పెషల్ స్క్రీనింగ్ చేశారు.
ఇండియా నుంచి ఈ ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఇండియన్ ప్రతినిధిగా బన్నీ అటెండ్ అయ్యాడు. ఈ వేదిక పై బన్నీ మాట్లాడుతూ.. పుష్ప సినిమాకు మూడో భాగం కూడా వచ్చే అవకాశం ఉందని అన్నాడు. ఓ ఫ్రాంచైజ్‌లా పుష్ప సినిమాను తెరకెక్కించాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. అలాగే.. పుష్ప సినిమా థియేటర్ల కంటే ఓటిటిలో ఎక్కువగా అభిమానులకు రీచ్ అయ్యిందని.. ఓటిటి వల్లే ఈ సినిమాకు ఇంటర్నేషనల్ వైడ్‌గా క్రేజ్ ఏర్పడిందని అన్నాడు. 2021లో బిగ్గెస్ట్ ఫిల్మ్‌గా పుష్ప నిలిచిందని.. పుష్ప పార్ట్ 2లో పుష్పరాజ్లోని ఓ డిఫరెంట్ షేడ్‌ను చూస్తారన్నారు.
పుష్పకు మించి తన క్యారెక్టరైజేషన్ చాలా నెక్స్ట్ లెవల్ అనేలా ఉంటుందని, పుష్పరాజ్‌కు ఎదురయ్యే సవాళ్లను ఆడియెన్స్ ఊహలకు మించి.. సుకుమార్ ఈ సినిమాలో చూపించబోతున్నాడని అన్నాడు బన్నీ. పుష్ప సినిమాను రీజనల్ లెవెల్లో తెరకెక్కించామని, పుష్ప 2ను మాత్రం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో రూపొందిస్తున్నామని చెప్పాడు. దీంతో పుష్ప2 పై అంచనాలు పెరిగిపోయాయి. మరి పుష్ప 3 ఇంకెలా ఉంటుందో చూడాలి.