గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు అంతర్జాతీయంగా అరుదైన గౌరవం లభించింది. ఆస్ట్రేలియాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్విహించే ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఆహ్వానం అందింది. దీంతో మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయను శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు అంతర్జాతీయంగా అరుదైన గౌరవం దక్కింది. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ వేదికపై మెరిసిన ఆ తరువాత పలు అంతర్జాతీయ వేదికలపై కనిపించారు. తాజాగా ఆస్ట్రేలియాలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఫీల్మ్ ఫెస్టివల్‌కు ఆహ్వానం అందింది. ప్రతీ సంవత్సరం జరిగే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 15వ ఎడిషన్ వేడుకలకు రామ్ చరణ్‌ను గౌరవ అతిథిగా ఆహ్మానించారు. ఆగస్టు 15 నుంచి 25 వరకు జరగనున్న ఈ వేడుకలకు మెగా హీరో హాజరుకానున్నారు.
ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ టీమ్ మాట్లాడారు.. ఈ సంస్థ స్థాపించి 15 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా తమ 15వ ఎడిషన్ కార్యక్రమానికి రామ్ చరణ్ హాజరు కావడం తమకు గొప్ప అనుభూతి అని అన్నారు. ఈ వేడుకల్లో భాగంగా చరణ్ నటించిన సినిమాలను ప్రదర్శిస్తామని వెల్లడించారు. అంతేకాకుండా ఇండియన్ సినిమాకు రామ్ చరణ్ చేసిన సేవలకు ‘భారతీయ కళ, సంస్కృతికి అంబాసిడర్’ బిరుదును కూడా ప్రదానం చేయనున్నట్టు పేర్కొన్నారు.
రామ్ చరణ్ తనకు గౌరవ అతిథిగా ఆహ్వానం అందడంపై స్పందిస్తూ… ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్లో పాలుపంచుకోవడం తనకు ఆనందంతో పాటు ఎంతో గౌరవంగా ఉందని అన్నారు. తెలుగు చిత్రాలను ప్రపంచవ్యాప్తంగా ఆదరించడం తనకెంతో సంతోషినిస్తుందన్నారు. అలాగే మన చిత్ర పరిశ్రమకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్యాలెంట్ కళకారులతో పరిచయం పెంచుకోవడం అనేది అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.