»Ooru Peru Bhairavakona Shocking Collections For First Day Bhairavakona
Ooru Peru Bhairavakona: ఫస్ట్ డే భైరవకోనకు షాకింగ్ కలెక్షన్స్!
ఊరు పేర భైరకోన సినిమాకు ఓ రోజు ముందే ప్రీమియర్స్ వేయగా.. సోషల్ మీడియాలో కాస్త డివైడ్ టాక్ స్ప్రెడ్ అయింది. కానీ సినిమా రిలీజ్ అయ్యాక మంచి టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో షాక్ ఇచ్చింది భైరవకోన.
Ooru Peru Bhairavakona: యంగ్ హీరో సందీప్ కిషన్ ఖాతాలో హిట్ పడి చాలా కాలం అయ్యింది. దీంతో లేటెస్ట్ ఫిల్మ్ ‘ఊరు పేరు భైరవకోన’ పై భారీ ఆశలే పెట్టుకున్నాడు సందీప్. పలు వాయిదాల అనంతరం ఈ వారమే థియేటర్లోకి వచ్చింది ఊరు పేరు భైరవకోన. వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. అనిల్ సుంకర సమర్పణలో రాజేశ్ దండా ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమా పై ఉన్న నమ్మకంతో ఓ రోజు ముందే ప్రీమియర్స్ షోస్ వేశారు మేకర్స్.
ప్రీమియర్స్కు కాస్త మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ థియేటర్లోకి వచ్చాక పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో మొదటి రోజు ఊహించని షాకింగ్ ఓపెనింగ్స్ రాబట్టింది ఊరు పేరు భైరవకోన. ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల 3 లక్షల రూపాయల గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు. సినిమా బడ్జెట్తో పోల్చి చూసుకుంటే, మొదటి రోజు ఈ వసూళ్ల మంచి నంబర్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఆడియన్స్కు ఈ సినిమా తప్ప మరో ఆప్షన్ లేదు. కాబట్టి.. ఈ వీకెండ్ వరకు భైరవకోనకు మంచి వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉంది.
అందుకుతగ్గట్టే బుకింగ్స్ కూడా బాగున్నాయి. 9 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరుపుకొని.. పది కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో రిలీజ్ అయిన ఈ సినిమాకు.. ఫస్ట్ డే కలెక్షన్స్.. సెకండ్, థర్డ్ డే బుకింగ్స్ కూడా బాగుండడంతో.. ఇదేం పెద్ద టార్గెట్గా కనిపించడం లేదు. మొత్తంగా ఈ సినిమాతో సందీప్ కిషన్ సక్సెస్ ట్రాక్ ఎక్కినట్టే. మరి లాంగ్ రన్లో భైరవకోన ఎంత రాబడుతుందో చూడాలి.