Tillu Square: ప్రీమియర్స్ షోస్ లేవు, ప్రెస్ షోస్ లేవు.. అయినా కూడా ఫస్ట్ డే సాలిడ్ మౌత్ టాక్‌తో అదరగొట్టేసింది టిల్లు స్క్వేర్ సినిమా. డీజె టిల్లు సీక్వెల్‌గా వచ్చిన టిల్లు స్క్వేర్ మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఫస్ట్ షో నుంచే ఈ సినిమా యూనానిమస్‌గా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక బుకింగ్స్‌తోనే ఈ సినిమాకు సూపర్ కలెక్షన్స్ వచ్చాయి. ఒక్క హైదరాబాద్‌లోనే టిల్లు స్క్వేర్ మూవీకి రెండు కోట్ల వరకు గ్రాస్ బుకింగ్స్ అయినట్లు ట్రేడ్ వర్గాలు మాట. ఇక ఓవర్సీస్ ప్రీమియర్స్‌తోనే 500K డాలర్ మార్క్‌ను టచ్ చేసింది.
ప్రీమియర్స్ అండ్ డే 1 కలిపి 1 మిలియన్ డాలర్స్ మార్కుని క్రాస్ చేసి సూపర్ ఓపెనింగ్స్ అందుకుంది టిల్లు స్క్వేర్. ఓవర్సీస్లో ఏకంగా 1.2 మిలియన్ డాలర్స్ మార్క్ అందుకోవడం విశేషం. మొదటి రోజుకే ఇలా ఉంటే.. వీకెండ్‌కి దుమ్ములేపడం గ్యారెంటీ. ఇక ఓవరాల్‌గా ప్రపంచ వ్యాప్తంగా.. టిల్లు గాడు ఫస్ట్ డే కలెక్షన్స్‌తో గట్టిగా కొట్టాడు. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా 23.7 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసినట్టుగా మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. దీంతో ఇది రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్ అనే చెప్పాలి.
మొత్తంగా 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజ్ అయిన ఈ సినిమాకు.. డే వన్‌తోనే అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయంటే.. ఫస్ట్ వీకెండ్ వరకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయి.. లాభాల పట్టనుందనే చెప్పాలి. ఇక సిద్ధు సరసన అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాను.. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ 4 సినిమాస్ వారు నిర్మాణం వహించారు.