»Gangs Of Godavari First Day Collections Vishvak Sen
Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. దుమ్ములేపిన విశ్వక్!
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ 'గామి' తర్వాత నటించిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. పలు మార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా.. ఫైనల్‌గా మే 31న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకు ఫస్డ్ వసూళ్లు భారీగా వచ్చినట్టుగా తెలుస్తోంది.
Gangs of Godavari' first day collections Vishvak sen
Gangs of Godavari: యంగ్ హీరో మాస్ కా దాస్ సినిమా సినిమాకు తన క్రేజ్ పెంచుకుంటూ పోతున్నాడు. డిఫరెంట్ అటెంప్ట్ చేస్తూ ఆడియెన్స్‌ను మెప్పిస్తున్నాడు. చివరగా గామితో ప్రేక్షకుల ముందుకొచ్చిన విశ్వక్.. తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో థియేటర్లోకి వచ్చాడు. మే 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజైంది. కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ పై నాగవంశీ, సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. విశ్వక్ సరసన నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమాలో విశ్వక్ మాస్ ర్యాంపేజ్ చూపించినట్టుగా రివ్యూలు వస్తున్నాయి. లంకల రత్నగా దుమ్ములేపాడని అంటున్నారు. అయితే.. అక్కడక్కడ మిక్స్డ్ రివ్యూలు వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ డే మంచి వసూళ్లను రాబట్టింది. బడ్జెట్లో దాదాపు 40 శాతం రికవరి చేసినట్టుగా తెలుస్తోంది.
మొత్తంగా 8.2 కోట్ల గ్రాస్ వచ్చిందని అనౌన్స్ చేశారు మేకర్స్. షేర్ వసూళ్ల పరంగా చూస్తే నాలుగు కోట్లకు పైగా ఉంటుందని అంటున్నారు. దీంతో.. మరోసారి విశ్వక్ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటాడనే చెప్పాలి. వీకెండ్లో కూడా కలెక్షన్స్ ఇలానే ఉంటే, సోమవారం నాటికి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి బ్రేక్ ఈవెన్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే.. జూన్ 4న ఎన్నికల రిజల్ట్ హడావుడి ఉంటుంది కాబట్టి.. వసూళ్లు భారీగా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ సినిమా బిజినెస్ 12 కోట్ల వరకు జరిగినట్టుగా సమాచారం. ఇదే జోష్‌లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వసూళ్లు ఉంటే మాత్రం.. ఇదేం పెద్ద టార్గెట్ కాదని అంటున్నారు. మరి లాంగ్ రన్లో ఎంత రాబడుతుందో చూడాలి.