Family Star: ఫ్యామిలీ స్టార్’ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఇది చాలా తక్కువ?
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్‌గా మారి.. మార్చి 5న గ్రాండ్‌గా థియేటర్లోకి వచ్చాడు. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు చేసినంత ప్రమోషన్స్ మరో సినిమాక చేయలేదనే చెప్పాలి. కానీ సినిమా టాక్ మాత్రం తేడా కొట్టేసింది.
Family Star first day collections Vijay Devarakonda Mrunal Takur
Family Star: టైటిల్‌తోనే ఫ్యామిలీ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసింది ఫ్యామిలీ స్టార్ సినిమా. అయితే.. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ మేకర్స్ మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ వస్తోందని చెబుతున్నారు. దర్శకుడు పరశురామ్ మాట్లాడుతూ.. ఇదొక ఆణిముత్యం లాంటి సినిమా అని అన్నారు. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ.. చాలా హ్యాపీగా ఉంది, ఆడియెన్స్‌తో కలిసి సినిమా చూశా, చాలా ఎమోషనల్‌గా ఫీలవుతున్నారని చెప్పుకొచ్చింది. ఇక నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ఉదయం నాలుగు గంటల నుంచే యూఎస్ నుంచి మెసేజ్‌లు రావడం స్టార్ట్ అయ్యాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా థియేటర్స్‌కు వెళ్తున్నారని చెప్పారు. మొత్తంగా ఫ్యామిలీ స్టార్ సినిమా మేము టార్గెట్ చేసిన ఫ్యామిలీ ఆడియెన్స్‌కు రీచ్ అయ్యింది.. అని అన్నారు.
దీంతో ఫ్యామిలీ స్టార్ ఫస్ట్ డే వసూళ్లు ఎంత? అనేది ఆసక్తికరంగా మారింది. దాదాపు 45 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అయింది. కానీ డే వన్ వరల్డ్ వైడ్‌గా 6 కోట్ల నెట్ వసూళ్లు కూడా క్రాస్ చేయలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. గ్రాస్ పరంగా ఈ లెక్క డబుల్ ఉంటుంది. అయితే.. విజయ్ నటించిన లైగర్, ఖుషి సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్‌తో పోల్చుకుంటే.. ఇది చాలా తక్కువనే చెప్పాలి. అయితే.. ఓవర్సీస్లో మాత్రం 475K+ డాలర్స్ వసూలు చేసింది. మరి లాంగ్ రన్లో ఫ్యామిలీ స్టార్ ఎంత రాబడుతుందో చూడాలి. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ సినిమాను పరుశురాం దర్శకత్వం వహించాడు.