»Popular Chief Minister Who Is The Most Popular Cm In The Country
Popular Chief Minister: దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎం ఎవరంటే?
దేశంలో అత్యంత పాపులారిటీ ఉన్న ముఖ్యమంత్రి జాబితాలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అగ్రస్థానంలో నిలిచారు. ఉత్తరప్రదేశ్ సీఎం ప్రస్తుతం తరువాతి స్థానంలో కొనసాగుతున్నారు.
Popular Chief Minister: దేశంలో అత్యంత పాపులారిటీ ఉన్న ముఖ్యమంత్రి జాబితాలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అగ్రస్థానంలో నిలిచారు. ఉత్తరప్రదేశ్ సీఎం ప్రస్తుతం తరువాతి స్థానంలో కొనసాగుతున్నారు. ఇటీవల ఓ ఆంగ్ల పత్రిక చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. సర్వే ప్రకారం.. భారత్లో అత్యధిక కాలం సీఎంగా ఉన్న వ్యక్తి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 52.7 శాతం ప్రజాదరణతో అగ్రస్థానంలో ఉన్నారు. 2000 నుంచి ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నారు.
51.3 శాతం పాపులారిటీతో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ (రాష్ట్రానికి 21వ సీఎం) రెండో స్థానంలో ఉన్నారు. 2017 నుంచి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. రాష్ట్ర సీఎంగా ఎక్కువ కాలం పనిచేస్తున్న నేత. అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ 48.6 శాతం ప్రజాదరణతో మూడో స్థానంలో ఉన్నారు. 2021లో రాష్ట్ర 15వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 42.6 శాతంతో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నాలుగో స్థానంలో నిలవగా.. తిప్రుర సీఎం మాణిక్ సాహా 41.4 శాతం ప్రజాదరణతో ఐదో స్థానంలో దక్కించుకున్నారు. 2016లో కాంగ్రెస్ను వీడి భాజపాలో చేరిన సాహా 2022లో సీఎం పీఠమెక్కారు.