»Rakul Preet Singh Rakul Is Excited Before The Wedding
Rakul Preet Singh: పెళ్లికి ముందు రెచ్చిపోయిన రకుల్!
బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీతో చాలా కాలంగా ప్రేమలో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్.. ఎట్టకేలకు ప్రేమించిన వాడితో పెళ్లి పీఠలెక్కబోతోంది. ఈ నేపథ్యంలో కాబోయే ఈ కొత్త జంట ముంబైలోని ప్రముఖ సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించారు. కానీ ఫోటో షూట్‌తో మాత్రం రెచ్చిపోయింది అమ్మడు.
Rakul Preet Singh: వచ్చే వారమే రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి పీటలెక్కబోతోంది. కొంత కాలంగా జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్న రకుల్.. అతనితోనే మూడు ముళ్లు వేయించుకోబోతోంది. ఫిబ్రవరి 21న గోవాలో రకుల్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇప్పటికే వీరి పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా తక్కువమంది సన్నిహితుల, బంధువుల సమక్షంలో రకుల్, జాకీ పెళ్లి చేసుకోనున్నారు. ఈ పెళ్లి పూర్తిగా ఎకో ఫ్రెండ్లీగా జరగనుందని సమాచారం. పెళ్లి కోసం 45 ఎకరాల్లో ఉన్న ఐటిసి గ్రాండ్ గోవా రిసార్ట్ని బుక్ చేశారు.
ఇక పెళ్లికి సమయం దగ్గర పడుతుండడంతో ముంబైలోని ప్రముఖ సిద్ధ వినాయక ఆలయాన్ని సందర్శించుకున్నారు రకుల్, జాకీ భగ్నానీ. వినాయకుడి ముందు వెడ్డింగ్ కార్ట్ పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే.. ఇదే సమయంలో రకుల్ హాట్ ఫోటో షూట్స్ కూడా వైరల్ అవుతోంది. పెళ్లికి ముందు కూడా అస్సలు తగ్గేదేలే అన్నట్టుగా రెచ్చిపోయింది అమ్మడు.
ప్రముఖ ఎల్లే మ్యాగజైన్ కోసం రకుల్ ఈ హాట్ హాట్ ఫోటో షూట్ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇదొక్కటే కాదు.. గత వారం పది రోజులుగా రకుల్ షేర్ చేసిన హాట్ హాట్ ఫోటో షూట్ లిస్ట్ చాలా పెద్దగానే ఉంది. దీంతో పెళ్లికి ముందు కూడా తగ్గేదేలే అంటోంది రకుల్. మరి ఇప్పుడైనా ఫోటో షూట్స్ తగ్గించి పూర్తిగా పెళ్లి పై దృష్టి సారిస్తుందా? లేదా? మరింత రెచ్చిపోతుందా? అనేది చూడాలి.