Viral Video : మధ్యప్రదేశ్ లో సభ్య సమాజం తలదించుకునే సంఘటన వెలుగులోకి వచ్చింది. పసుపు చీర కట్టుకున్న మహిళను ఐదుగురు వ్యక్తులు దారుణంగా హింసించారు. ఒకరు ఆమె చేయి పట్టుకోగా.. మరొకరు మహిళపై కర్రతో తీవ్రంగా దాడి చేశాడు. బాధిత మహిళ పదే పదే కనికరం కోసం వేడుకుంటూనే ఉంది. అయినా ఆమెపై లాఠీచార్జి కొనసాగించారు. మహిళను అతి కిరాతకంగా కొట్టారు. అక్కడ ఉన్న వాళ్లు ఈ సంఘటన మొత్తాన్ని కళ్లారా చూస్తూనే ఉన్నారు. కానీ మహిళను రక్షించడానికి ఎవరూ ప్రయత్నించలేదు. మహిళపై దాడికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో, పోలీసుల అలర్ట్ అయ్యారు. ఈ షాకింగ్ ఘటన ఎంపీ ధార్ జిల్లాలోని తండా పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. మహిళను దారుణంగా కొట్టడంపై సోషల్ మీడియాలో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కొట్టేటప్పుడు మహిళ నిందితుడి బారి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడం కనిపించింది. అయితే వారి హింస నుండి తప్పించుకోవడానికి ఆమె చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. మహిళను రక్షించే బదులు, మహిళను కొడుతుండగా ఫోన్లలో వీడియోలను చిత్రీకరిస్తూనే ఉన్నారు. ఈ సిగ్గుమాలిన ఘటనకు పాల్పడిన ప్రధాన నిందితుడి పేరు నూర్ సింగ్. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇతర నిందితుల కోసం పోలీసులు అనేక బృందాలను ఏర్పాటు చేసి సోదాలు నిర్వహిస్తున్నారు.
• #धार ज़िले की इस घटना ने एक बार फिर @BJP4MP शासन की महिला सुरक्षा पर गंभीर सवाल उठाए हैं!
• वैसे ही #मध्यप्रदेश महिलाओं पर अत्याचार में पहले नंबर पर है! @DrMohanYadav51 जी,
– क्या धार की ये बहन आपकी सरकार से यह उम्मीद रख सकती हैं कि इस घटना की निष्पक्ष एवं त्वरित जांच होगी… pic.twitter.com/PTs7OHNY7L
— Jitendra (Jitu) Patwari (@jitupatwari) June 22, 2024
మహిళపై దాడికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రభుత్వంపై కాంగ్రెస్ దాడి చేసింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు అధ్వానంగా ఉన్నాయని కాంగ్రెస్ రాష్ట్రాధ్యక్షుడు జితు పట్వారీ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని ఆరోపించారు. మహిళపై దాడికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో, ఈ సంఘటన మరోసారి బిజెపి పాలనలో మహిళల భద్రతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. మహిళలపై అఘాయిత్యాల విషయంలో మధ్యప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.