ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతో పవిత్రంగా భావించేవి కొన్ని ఉంటాయి. దైవ దర్శనానికి, పూజలకు హిందువులు ఎంత ప్రాముఖ్యతను ఇస్తారో, దేవతామూర్తులకు సమర్పించే ప్రసాదం విషయంలో కూడా ఆ పవిత్రతను పాటిస్తారు. ఇండ్లల్లో పండుగలకు కూడా ప్రసాదం వన్డే విషయంలో నియమనిష్టలు తప్పనిసరిగా పాటిస్తారు. అలాంటిది కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి నిలయం అయిన తిరుమల లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ప్రసాదం అంటే ప్రతి హిందువుకు ఒక ఎమోషన్. తిరుమల లడ్డు అంటే ప్రతి ఒక్కరికి దైవంతో సమానమే. స్వామి వారి లడ్డు ప్రసాదం తిన్నా ఎన్నో జన్మల పుణ్యఫలితం అని భక్తులు బాగా నమ్ముతారు. అందుకే ఎవరు తిరుమల వెళ్లినా లడ్డు తీసుకురమ్మని భక్తులు అడగడం అనాదిగా వస్తుంది.
తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ తిరుమల ప్రసాదం గురించి చేసిన సంచలన వ్యాఖ్యలు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాయి. నిన్న జరిగిన కూటమి పార్టీల సమావేశంలో గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలను ప్రస్తావిస్తూ తిరుమల లడ్డు పైన కూడా చంద్రబాబు స్పందించారు. గత ప్రభుత్వంలో పవిత్రమైన తిరుమలలో కూడా వైసీపీ ప్రభుత్వం ఇష్ఠారాజ్యంగా వ్యవహరించారని… ‘ తిరుమల లడ్డు ప్రసాదంలో సైతం స్వత్చామైన నెయ్యి వాడకుండా జంతువుల కొవ్వుతో తయారుచేసే కల్తీ నెయ్యి వాడారని’ అన్నారు.
ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చలకు దారి తీశాయి. తిరుమల పవిత్రతను కాపాడుతామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పలుమార్లు ఎలక్షన్ ప్రచార సభల్లో కూడా హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ కామెంట్స్ చూస్తుంటే త్వరలో ఈ విషయంపై కూడా చర్యలు తీసుకునేలా కనిపిస్తున్నాయి. ఈ కామెంట్స్ పై గత ప్రభుత్వం లో తిరుమల బాధ్యతలు చేపట్టిన భూమన కరుణాకర రెడ్డి, వై వీ సుబ్బా రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి