నాలుగోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్కు చంద్రబాబు మొదటిసారి వచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ గడ్డపై టీడీపీకు పునర్ వైభవం వస్తుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
Chandrababu Naidu: TDP flag will fly as long as there is a Telugu nation
Chandrababu Naidu: తెలంగాణ గడ్డపై టీడీపీకు పునర్ వైభవం వస్తుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణ తనకు రెండు కళ్లు అని తెలిపారు. నాలుగోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్కు చంద్రబాబు మొదటిసారి వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అభిమానం చూస్తుంటే ఉత్సాహం వస్తుంది. ఏపీలో విజయానికి తెలంగాణ టీడీపీ శ్రేణులు పరోక్షంగా కృషి చేశారు. ఎన్టీఆర్ అనేక పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చారు. సంక్షేమానికి నాంది పలికిన నాయకుడు ఎన్టీఆర్. తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ జెండా రెపరెపలాడుతుందన్నారు.
సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని మళ్లీ అధికారంలోకి వచ్చామన్నారు. జైల్లో పెట్టినప్పుడు టీడీపీ శ్రేణులు చూపించిన ప్రేమ మరువలేనన్నారు. నాలెడ్జి, ఎకానమీకి టీడీపీ హయాంలో నాంది పలికాం. నా తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్ అభివృద్ధిని కొనసాగించాయి. విభజన సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకున్నాం. దాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు. ఆయనకు కృతజ్ఞతలు. తెలుగు రాష్ట్రాల మధ్య ఐకమత్యం ఉండాల్సిన అవసరముందన్నారు. తెలుగు భాష, జాతి ప్రయోజనాలను పరిరక్షించుకోవాలి. ఏపీ, తెలంగాణ అభివృద్ధే టీడీపీ ధ్యేయమన్నారు.