BHNG: బీబీనగర్ మండలం జైనపల్లి సర్పంచ్ నక్కిర్తి హేమలత గణేశ్ ముదిరాజ్ తన పాలకవర్గంతో కలిసి శనివారం భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పైళ్ల శేఖర్ రెడ్డి నూతన పాలకవర్గాన్ని సర్పంచ్ నక్కిర్తి హేమలత గణేశ్ ముదిరాజ్, ఉప సర్పంచ్ మురిగాడి చంద్రమౌళి గౌడ్, వార్డు సభ్యులను సన్మానించి అభినందనలు తెలిపారు.