CTR: జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు అమలు చేస్తున్న 100 రోజుల ప్రణాళికలో విద్యార్థుల మార్కులను నమోదు చేయకపోతే షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని డీఈవో రాజేంద్ర ప్రసాద్ హెచ్చరించారు. పాఠశాలల్లో తప్పనిసరిగా టెన్త్ విద్యార్థులకు వందరోజుల ప్రణాళిక అమలు చేయాలని చెప్పారు. పరీక్షలు నిర్వహించి ఫలితాలను నమోదు చెయ్యాలన్నారు.