రావు రమేశ్ నటించిన “మరుతి నగర్ సుబ్రమణ్యం” సినిమా ఈ నెలలో స్మాల్ స్క్రీన్ రిలీజ్ కు సిద్ధమైంది. ఈ సినిమా ఆయన ప్రధాన పాత్రలో నటించిన తొలి చిత్రం. ఈ చిత్రం సెప్టెంబర్ 20న AHA యాప్‌లో స్ట్రీమ్ అవ్వనుంది.
ఈ చిత్రంలో రావు రమేశ్ ఒక మధ్య తరగతి వ్యక్తిగా నటించారు, కుటుంబాన్ని చూసుకోవడం కోసం ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఎన్ని కష్టాలు పడతాడో అనేది కధాంశంగా తెరకెక్కింది. ఈ చిత్రం ఆగస్టులో థియేటర్లలో విడుదలై, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది.
సూపర్ స్టార్ మహెష్ బాబు సైతం ఈ సినిమా చూసి తనకు బాగా నచ్చిందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.
సుకుమార్ భార్య తబితా సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో ఇంద్రజ, అంకిత్ కోయ్యా మరియు రమ్య పసుపులేటి ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.
థియేటర్లలో సాధారణ స్పందన పొందిన కొన్ని సినిమాలు OTTలో మంచి వ్యూయర్షిప్ను అందుకున్నాయి, దీంతో “మరుతి నగర్ సుబ్రమణ్యం” ఎలా అందుకుంటుందో చూడాలి. OTT ప్లాట్‌ఫామ్‌పై ప్రేక్షకుల ఆదరణ ఎలా ఉండాలో బహిర్గతం కావాల్సి ఉంది.