ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా జరిగిన ప్రెస్ మీట్లో తిరుమల లడ్డూ ప్రసాదం చుట్టూ ఉన్న వివాదంపై స్పందించారు. ఈ విషయంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలపై జగన్ సక్రమంగా సమాధానం ఇచ్చారు. ఈ వివాదం గురించి జరిగిన చర్చలు దేశవ్యాప్తంగా మీడియాలో విపరీతంగా వ్యాపించాయి, ప్రజలు ఈ అంశంపై ఆసక్తిగా చర్చిస్తున్నారు.
జగన్ ఈ సందర్భంగా టీడీపీ వంద రోజుల పాలనను పరిగణనలోకి తీసుకుని, ఈ ఆరోపణలు మొత్తం ఈ వంద రోజుల అసమర్ధ పాలనకు డైవర్షన్ చేయడానికి సృష్టించింది మాత్రమే అని అన్నారు. “టీడీపీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలం అయిందన్నారు,”. గత ప్రభుత్వంలో అమలుచేసిన అనేక సంక్షేమ పథకాలను టీడీపీ ఇప్పుడు ఆపేసిందని ఆయన పేర్కొన్నారు.
తిరుమల లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి మూడు దఫాలుగా పరీక్షించబడుతుందని, లడ్డూ తయారీలో ఎటువంటి కల్తీ ఉండదని జగన్ స్పష్టం చేశారు. “ఏ ప్రభుత్వం వచ్చినా, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో మార్పులు జరగవు,” అని ఆయన అన్నారు. టీడీపీ చేసిన ఆరోపణలకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానాన్ని కూడా వెళ్ళింది. ఈ ఆరోపణలపై నేను నా కుటుంబసభ్యులతో సహా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, చంద్రబాబు రెడీనా అని జగన్ ప్రశ్నించారు.