»Sunny Leone Applied For Police Job At Uttar Pradesh
Sunny Leone: నాకో పోలీసు జాబ్ ఇవ్వండి.. అప్లికేషన్ పెట్టిన సన్నీ లియోన్
సన్నీలియోన్ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేస్తుంది.. ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పలు సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేసి ఎన్నో సూపర్ హిట్స్ అందుకుని మంచి పేరు తెచ్చుకుంది.
Sunny Leone: సన్నీలియోన్ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేస్తుంది.. ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పలు సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేసి ఎన్నో సూపర్ హిట్స్ అందుకుని మంచి పేరు తెచ్చుకుంది. 2012లో ‘జిస్మ్ 2’ సినిమాతో వెండితెరకు పరిచయమైన సన్నీలియోన్ ఇప్పటికీ సినిమాల్లో యాక్టివ్గా కొనసాగుతోంది. చాలా తెలుగు సినిమాల్లో కూడా నటించింది. ఆమె చివరిగా మంచు విష్ణు హీరోగా నటించిన ‘జిన్నా’ సినిమాలో నటించింది. ఈ సినిమా తర్వాత ఆమె ప్రస్తుతం రెండు మలయాళ చిత్రాలు, రెండు తమిళ చిత్రాలు, నాలుగు హిందీ చిత్రాలు, ఒక కన్నడ చిత్రంలో చేస్తోంది.
సన్నీలియోన్ సినిమాలతో బిజీగా పోలీస్ ఉద్యోగానికి ఎందుకు దరఖాస్తు చేసుకుంటుందో అని మీరు ఆశ్చర్యపోవచ్చు. అయితే వాస్తవానికి ఆమె పెరిగిన ఉత్తరప్రదేశ్లో పోలీసు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంది. ప్రస్తుతం యూపీలో యూపీపీఆర్బీ పోటీ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పోటీ పరీక్షల్లో సన్నీలియోన్ పేరుతో ఓ గుర్తుతెలియని వ్యక్తి పోలీసు ఉద్యోగానికి దరఖాస్తు చేశాడు. ఆమె అసభ్యకరమైన ఫోటోలను ఫోటో బ్లాక్లో ఉంచారు. దీంతో కోపోద్రిక్తులైన అధికారులు ఈ పని ఎవరు చేశారనే దానిపై చర్యలు చేపట్టారు.