Mohan Babu ఆగ్రహం.. ఇక ఊరుకోనని సోషల్ మీడియాలో పోస్ట్
సినీనటుడు మోహన్ బాబు సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేశారు. ఆయన పేరును రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని, దీనిపై అస్సలు ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు. అవసరమైతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
Mohan Babu: మంచు మోహన్(Mohan babu) బాబు పరిచయం అవసరం లేని పేరు. తన పేరును కొందరు రాజకీయంగా వాడుకుంటున్నారని వెల్లడించారు. అలాంటి వారిని అస్సలు ఉపేక్షించను అని అంటున్నారు. తన పేరును వాడితే న్యాయపరమైన చర్యలు తీసుకుంటా అని ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు.
‘‘ఈ మధ్య కాలంలో నా పేరుని రాజకీయంగా కొందరు ఉపయోగించుకుంటున్నట్లుగా నా దృష్టికి వచ్చింది. దయచేసి ఏ పార్టీ వారైనా నా పేరును వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. మనం అనేక రకాల భావావేశాలున్న వ్యక్తుల ప్రపంచంలో జీవిస్తున్నాము. ఎవరి అభిప్రాయాలు వారివి. అది వారి వ్యక్తిగతం. చేతనైతే నలుగురికి సాయపడటంలోనే మనం దృష్టి పెట్టాలిగానీ, సంబంధం లేని వారిని రాజకీయ పార్టీల్లోకి, వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకురావడం బాధాకరం. నాకు అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికీ అభివందనాలు తెలియజేస్తూ.. శాంతి, సౌభ్రాతృత్వాలను వ్యాపింపజేయడంలో అందరం బద్ధులై ఉందామని కోరుకుంటూ, ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తూ.. ధన్యవాదాలతో డా. మోహన్‌బాబు’’ అంటూ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్టు ఎవరిని ఉద్దేశించి పెట్టారని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం మోహన్ బాబు కన్నప్ప చిత్రంలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్‌లాల్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారని తెలుస్తుంది.