Chandrababu got relief in skill development case. Adjourned the case for three weeks.
Chandrababu: స్కిల్ డెవలప్మెంట్ కేసు(skill development case)లో టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu)కు సుప్రీం కోర్టు స్వల్ప ఊరట కల్పించింది. కేసు విచారణను ధర్మాసనం మూడు వారాలకు వాయిదా వేసింది. ఇదే సమయంలో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ బేలా ఎం. త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. . బోగస్ ఇన్వాయిస్లతో నిధులు అన్ని దారి మళ్లించారని న్యాయవాదులు కోర్టుకు ఆధారాలు సమర్పించారు. వాటిని సవాలు చేస్తూ చంద్రబాబు తరపు న్యాయవాది పిటిషన్ వేశారు.
అదే విధంగా చంద్రబాబు ఆరోగ్యం దృష్ట్యా ఇచ్చిన బెయిల్‌ను పొడగించిన విషయం తెలిసిందే. ఆయనకు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని ధర్మాసనానికి ఏపీ సీఐడీ పిటిషన్ ఇచ్చింది. దానిపై చంద్రబాబు తరఫు న్యాయవ్యాది కౌంటర్ ఫిటిషన్ ఇవ్వగా.. ఈ రోజు చేపాట్టాల్సిన విచారణను మూడు వారాల తరువాత వాయిదా వేశారు. దీంతో టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. పార్టీ అభ్యర్థులను ప్రకటించిన సమయంలో వారితో చంద్రబాబు, వర్చువల్‌గా, బహిరంగంగా సమావేశం అవుతూ కీలక సూచనలు ఇస్తున్నారు.