కాకినాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ప్రత్తిపాడు మండల సమీపంలోని పాదాలమ్మ గుడి వద్ద జాతీయ రహదారిపై ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు.
Kakinada: కాకినాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ప్రత్తిపాడు మండల సమీపంలోని పాదాలమ్మ గుడి వద్ద జాతీయ రహదారిపై ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. ఒడిశా నుంచి బాపట్ల వైపు వెళ్తున్న లారీ టైరు పంక్చర్ అయ్యింది. దీంతో రహదారి పక్కనే నిలిపివేసి మరమ్మతులు చేస్తున్నారు. ఇదే సమయంలో విశాఖ నుంచి రాజమహేంద్రవరం వైపు ఏపీఎస్ఆర్టీసీ బస్సు వెళ్తుంది. పక్కనే ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో లారీ మరమ్మతులు చేస్తున్న ముగ్గురు వ్యక్తులతో పాటు అటువైపు వెళ్తున్న వ్యక్తి అక్కడిక్కడే చనిపోయారు. ప్రమాదం జరిగిన తర్వాత కూడా బస్సు ఆపకుండా డ్రైవర్ రాజమహేంద్రవరం వైపు తీసుకెళ్లారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.