Sajjanar: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గ్రాండ్ ఫినాలే నిన్న ముగిసిన సంగతి తెలిసిందే. పల్లవి ప్రశాంత్‌ను టైటిల్ వరించింది. రన్నరప్‌గా అమర్ దీప్ నిలిచాడు. అమర్ దీప్ కుటుంబం అన్నపూర్ణ స్టూడియో నుంచి కారులో ఇంటికి వెళుతుండగా కొందరు దాడి చేశారు. మరికొందరు ఆర్టీసీ బస్సులపై దాడి చేశారు. ఈ ఘటనను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Sajjanar) ఖండించారు. బస్సులపై దాడికి సంబంధించి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో తమ సిబ్బంది ఫిర్యాదు చేశారని వివరించారు.
అభిమానం పేరుతో చేసే పిచ్చి చేష్టలు సమాజానికి మంచివి కావన్నారు. బస్సులపై దాడి చేయడం అంటే సమాజంపై చేసినట్టే అవుతుందన్నారు. ఇలాంటి ఘటనలను ఆర్టీసీ యాజమాన్యం ఉపేక్షించదన్నారు. ఆర్టీసీ బస్సులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
బిగ్ బాస్ ఫైనల్ విజేత ప్రశాంత్ అని తెలిసిన వెంటనే అమర్దీప్ అభిమానులతో గొడవ జరిగింది. చిన్నగా మొదలైన వాగ్వివాదం ఘర్షణకు దారితీసింది. ఒకరికొకరు దూషించుకున్నారు. ఆ తర్వాత కృష్ణా నగర్ వద్ద ఆరు ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. ఆ అంశంపై ఆర్టీసీ ఎండీ స్పందించారు.