»Telangana Government Increased 21 Percent Fitness For Rtc Employees
TSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు 21 శాతం ఫిట్మెంట్ పెంచిన తెలంగాణ ప్రభుత్వం
ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం అమలు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. తాజాగా ఆర్టీసీ ఉద్యోగులకు 21 శాతం పీఆర్సీ పెంచినట్లు చెప్పారు.
Telangana government increased 21 percent fitness for RTC employees
TSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు 21 శాతం ఫిట్మెంట్ ఇస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. బస్ భవన్లో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. జూన్ 1వ తేదీ నుంచి కొత్త ఫిట్మెంట్ అమలవుతుందని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని వెల్లడించారు. గత ప్రభుత్వం 2017లో 16 శాతం పీఆర్సీ ఇచ్చిందని, తరువాత దాని ఊసే లేదని పేర్కొన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 21 శాతం పీఆర్సీని ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీని వలన ప్రభుత్వంపై భారం పడుతుందన్నారు.
ఈ పీఆర్సీతో ఆర్టీసీపై నెలకు రూ.35 కోట్లు, ఏడాదికి రూ.418 కోట్లకు పైగా భారం పడుతుందని తెలిపారు. అయినా సరే 53 వేలకు పైగా తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు ప్రయోజనం పొందుతారు అని పొన్నం ప్రభాకర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే తమ ప్రభుత్వం మహాలక్ష్మి అమలు చేసిందని అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్న ప్రజారవాణను అద్భుతంగా నడుపనున్నట్లు వెల్లడించారు.