VZM: బొబ్బిలి మండలంలో డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై తహసీల్దార్ ఎం శ్రీనుకు డీలర్లు అందరూ కలిసి గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల డీలర్ల సంఘం అధ్యక్షులు గేదెల సత్యనారాయణ మాట్లాడుతూ.. డీలర్లు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, వాటన్నింటినీ ప్రభుత్వం పరిగణలో తీసుకొని, సత్వరమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.