A Telangana RTC bus collided with a lorry in Nellore district. Two people were killed
Telangana RTC: నెల్లూరు(Nellore ) జిల్లా గుడ్లూరు మండలం మోచర్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం(road accident) జరిగింది. తెలంగాణ ఆర్టీసీ బస్సు ఓ లారీని వెనకనుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. టీఎస్ ఆర్టీసీ బస్సు మిర్యాలగూడ నుంచి తిరుపతికి వెళ్తుండగా మోచర్ల వద్ద లారీని బస్సు వెనకనుంచి బలంగా ఢీకొట్టడంతో బస్సు డ్రైవర్ స్పాట్లోనే చనిపోయాడు. ఈ ఘటనలో బస్సు ముందుభాగం నుజ్జునుజ్జు కావడంతో డ్రైవర్ వినోద్ (45) ప్రాణాలు కోల్పోయాడు. మరో ఏడుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తీసుకెళ్లారు. వీరిలో 65 ఏళ్ల వృద్ధురాలు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.